డివోషనల్ ఫిలిం శ్రీ ఆదిపరాశక్తి సినిమా థియేటర్స్ లో !!!
వినయ ప్రసాద్, జై జగదీశ్, యు ఉమేష్, తార ప్రధాన పాత్రల్లో తెరకేక్కిన సినిమా ‘శ్రీ ఆధిపరాశక్తి ’ శంకర్ రామారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 24న విడుదలై మంచి మౌత్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతోంది.
డివోషనల్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అమ్మవారి మహిమలు, గొప్పదనం గురించి డైరెక్టర్ వేమగల్ జగన్నాధ రావు చాలా చక్కగా చూపించారు. వినయ ప్రసాద్ నటన ఈ సినిమాకు మెయిన్ హైలెట్.
బి చలపతి ఈ సినిమాకు కథ అందించారు, నగేష్ ఆచార్య సినిమాటోగ్రాఫర్ గా చేసిన ఈ సినిమాకు మారుతి అర్ డి ధర్ సంయుక్తంగా సంగీతం సమాకూర్చారు, ఉదయరవి ఈ మూవీకి ఎడిటర్. మంచి సినిమాలు ఆధారించే ప్రేక్షకులు శ్రీ ఆదిపరాశక్తి సినిమాను మరింత సూపర్ హిట్ చేస్తారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

No comments