నేడు దర్శకుడు బోయపాటి శ్రీను జన్మదినం


టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మాస్ కమర్షియల్ డైరెక్టర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను. భద్రతో నుండి ఇప్పటి వరకు వచ్చిన అఖండ 2  వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను అని అందరికీ తెలిసిందే. 

ఆయనకి ఆయన సినిమాలకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ రోజు ఏప్రియల్ 25 న ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన చేయబోయే సినిమా ఏమిటి? హీరో ఎవరు? ఏ బ్యానర్ పై బోయపాటి మరుసటి సినిమా చేయబోతున్నారు? ఇలాంటి అనేక వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. 

వీటన్నిటికీ సమాధానంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోయే సినిమాకి సంబంధించిన న్యూస్ అతి త్వరలో అధికారికంగా అనౌన్స్ కానుంది.

No comments