"అంతర్యామి" షూటింగ్ పూర్తి... డబ్బింగ్ ప్రారంభం... త్వరలో ప్రేక్షకుల ముందుకు

ఒడిషా సూపర్ స్టార్ బాబుషాన్ మొహంతి, అందాల నటి వేద్విక సోని హీరో హీరోయిన్లుగా దర్శకుడు శివ సత్యం దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథా చిత్రం "అంతర్యామి". ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానరంజన్ సాహు నిర్మిస్తుండగా, అమృత్ నిషాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రీకరణ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

విభిన్నమైన కథ, ఆసక్తికరమైన కథనం, ఆకట్టుకునే సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో కస్తూరి, ఆమని, రవికుమార్, శ్రీతం దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె. గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీజే కార్తికేయన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అశోక్ బోయిన ఎడిటర్‌గా, బుస్సా బాలరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలర్‌ఫుల్ డిజిటల్ మీడియా పీఆర్ & డిజిటల్ ప్రమోషన్స్‌ను నిర్వహిస్తోంది.

చిత్ర వివరాలు:

చిత్రం: అంతర్యామి
హీరో: బాబుషాన్ మొహంతి
హీరోయిన్: వేద్విక సోని
దర్శకుడు: శివ సత్యం
నిర్మాత: జ్ఞానరంజన్ సాహు
సహ నిర్మాత: అమృత్ నిషాద్
ఛాయాగ్రహణం: కె. గుణశేఖరన్
సంగీతం: జీజే కార్తికేయన్
ఎడిటర్: అశోక్ బోయిన
సౌండ్ ఇంజనీర్ :సతీష్ బండారు
ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్:బుస్సా బాలరాజు
పీఆర్ & డిజిటల్: కలర్‌ఫుల్ డిజిటల్ మీడియా

No comments