వేగ లీల’ టీజర్ విడుదల.. కథ ఏంటో గెస్ చేయగలరా !!!!

టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాల జాబితాలో ‘వేగ లీల’ కూడా చేరుతోంది. ఘంటసాల నాగ విశ్వనాథ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్‌ను గమనిస్తే, ఈ సినిమా ఆన్‌లైన్ చాటింగ్, బ్లైండ్ డేటింగ్ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది.


సాధారణంగా ఓ సినిమా తెరకెక్కించే ప్రక్రియ చుట్టూ జరిగే కథలా కనిపిస్తున్నప్పటికీ.. టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు అసలు కథలో మరో ఆసక్తికరమైన కోణం ఉన్నట్లు సూచిస్తున్నాయి.

దీంతో ‘వేగ లీల’ అసలు కథ ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. కథ ఏంటో గెస్ చేయగలరా అంటూ చిత్ర బృందం ఇచ్చిన హింట్ మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్రీ లక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, జశ్రీత ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కుమార్ మేడి, వేణు జయ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

‘వేగ లీల’ చిత్రంలో జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్,ఆదర్శ్ పూంధీర్, సాయి ఆస్రిత్, రామ్ భూపతి, దీపకృతి రాథోడ్,అశోక్ వర్ధన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతలను ఘంటసాల నాగ విశ్వనాథ్ నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని జి.వి. & పవన్ చరణ్ అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా పవన్ చరణ్‌కు ఇదే తొలి సినిమా కావడం విశేషం. సినిమాటోగ్రఫీని దిలీప్ కుమార్ చిన్నయ్య, ఎడిటింగ్‌ను దిలీప్ కుమార్ నిర్వహిస్తున్నారు.

వేగ లీల చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టీజర్‌తో కథపై ఆసక్తిని పెంచిన చిత్ర బృందం.. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనుంది.

నటీనటులు : జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్,ఆదర్శ్ పూంధీర్, సాయి ఆస్రిత్, రామ్ భూపతి, దీపకృతి రాథోడ్,అశోక్ వర్ధన్.

సాంకేతిక వర్గం:

సమర్పణ: స్ప్లాష్ కలర్ మీడియా, శ్రీలక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, జశ్రీత ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్: సాయి కుమార్ మేడి, వేణు జయ 
కో-ప్రొడ్యూసర్స్: శ్రీకాంత్ వేంపరాల (USA), విక్రమ్ గార్లపాటి (USA), విశ్వనాథ్ మంచి కలపతి (USA), వెంకట్ చిలకాల (USA), మహీంద్ర అరవపల్లి (USA), స్వాతి.వై, రామ్ భూపతి, దిలీప్ కుమార్ చిన్నయ్య.
రైటర్ & డైరెక్టర్: ఘంటసాల నాగ విశ్వనాథ్
DOP: దిలీప్ కుమార్ చిన్నయ్య
ఎడిటర్: దిలీప్ కుమార్
క్రియేటివ్ హెడ్: వేణు నిఖిల్
కో-డైరెక్టర్: స్రవంతి
మ్యూజిక్: జి.వి. & పవన్ చరణ్
పబ్లిసిటీ డిజైనర్: దేవ్ హీమ్ ఎడిట్స్
పీఆర్వో: దినేష్ కోయ

No comments